నిత్యం పర్యవేక్షణ
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆదివారం వేకువజామున నుంచి ప్రారంభమైన దర్శనాలు నిరంతరాయంగా కొనసాగేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించారు. కలెక్టర్ రాజకుమారి గనియ, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ సునీల్ షెరాన్ నిత్యం ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ దేవస్థానం సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ కనిపించారు. క్యూలలో వృద్ధులు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకొని కలెక్టర్, ఎస్పీ, జేసీ సంయుక్తంగా సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితులను తెలుసుకుంటూ వైర్లెస్ సెట్ల ద్వారా అక్కడ అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించారు.
నిత్యం పర్యవేక్షణ


