పాగా కట్టి.. పెళ్లి కుమారుడై.. | - | Sakshi
Sakshi News home page

పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..

Feb 16 2026 7:50 AM | Updated on Feb 16 2026 7:50 AM

పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..

పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..

లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన హస్తినాపురం వాసి ఫృధ్వి సుబ్బారావు స్వామివారికి పాగాలంకరణ చేశారు. ఈ పాగా గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవ నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. మొత్తం సుమారు 10 పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement