285 మంది విద్యార్థులు గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

285 మంది విద్యార్థులు గైర్హాజరు

Feb 27 2026 4:13 AM | Updated on Feb 27 2026 4:13 AM

285 మ

285 మంది విద్యార్థులు గైర్హాజరు

నంద్యాల(న్యూటౌన్‌): ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌–2 పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్‌నాయక్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌ విద్యార్థులతో కలిపి 13,934 మంది విద్యార్థులకు గాను 13,649మంది హాజరు కాగా 285 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసినట్లు తెలిపారు.

తెలుగుగంగ ప్రధాన

కాలువకు భారీ గండి

బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాలువ కుడి వైపున 4వ బ్లాక్‌ వద్ద బుధవారం రాత్రి 15 అడుగుల భారీ గండి పడింది. దీంతో నీటి ప్రవాహం వరి పంట మీదుగా జీసీ పాలెం, లింగాపురం చెరువుల వైపు వెళ్లడంతో 60 ఎకరాల పొలం నీటి ముంపుకు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగు గంగ ఈఈ శంకర్‌ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి నీటి ప్రవాహన్ని పూర్తిగా నిలిపి వేశారు. పరిస్థితి అదుపులోనికి వచ్చాక గండిని మూసి వేస్తామని అధికారులు తెలిపారు. కాగా గండి పడిన సమయంలో కాలువలో రెండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎడమ వైపున గండి పడింది. మళ్లీ గండి పడటంతో కట్ట భద్రతపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉన్నతాదికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సబ్‌ జైలులో బోర్డ్‌ ఆఫ్‌

విజిటర్స్‌ బృందం

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్‌ జైలులో బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ బృందం నంద్యాల మండల లీగల్‌సెల్‌ చైర్మన్‌ అమ్మన్న రాజ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మండల లీగల్‌ సెల్‌ చైర్మన్‌ అమ్మన్నరాజ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు, నంద్యాల సబ్‌ జైళ్లలో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు సమస్యలను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యుల్లో డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు, డీఎంహెచ్‌ఓ, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, జిల్లా ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎంప్లాయీ మెంట్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌, ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీయల్‌ ఆఫీసర్లు ఉంటారన్నారు. వీరు ప్రతి నెలా నంద్యాల జిల్లాలోని సబ్‌ జైళ్లను తనిఖీ చేస్తూ ఖైదీల సమస్యలు, సంక్షేమం, న్యాయపరంగా విద్యా, ఆరోగ్య పరంగా సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం కోసం పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ విశ్వనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీఈఓ జనార్ధన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ గురుప్రసాదరెడ్డిలతో పాటు లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

285 మంది  విద్యార్థులు గైర్హాజరు 1
1/1

285 మంది విద్యార్థులు గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement