కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయివేట్‌ ఉద్యోగి నివాసం ఉంటున్నారు. యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే జరుగుతోందని తెలుసుకొని తమ ఇంటికి ఎవరూ రాకపోవడంతో సచివాలయానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో సర్వే పూర్తయిందని, మీరు అందుబాటులో లేకపోవడంతో వివరా | - | Sakshi
Sakshi News home page

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయివేట్‌ ఉద్యోగి నివాసం ఉంటున్నారు. యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే జరుగుతోందని తెలుసుకొని తమ ఇంటికి ఎవరూ రాకపోవడంతో సచివాలయానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో సర్వే పూర్తయిందని, మీరు అందుబాటులో లేకపోవడంతో వివరా

Feb 27 2026 4:13 AM | Updated on Feb 27 2026 4:13 AM

కర్నూ

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయ

విధి నిర్వహణలో తీవ్ర మానసిక ఒత్తిడి

పంచాయతీ కార్యదర్శులపై అధిక భారం

సర్వేలు, పన్ను వసూళ్లు, ఓటరు జాబితా రూపకల్పనతో సతమతం

అధిక సమయం తీసుకుంటున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే

పలు ప్రాంతాల్లో సర్వర్లు పనిచేయక ఇబ్బందులు

కర్నూలు(అర్బన్‌): గ్రామ/వార్డు సచివాలయల ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనేక రకాల సర్వేలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు ఆందోళనకు చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీ కార్యదర్శులపైనే అధిక భారం పడుతోంది. మెజారిటీ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తమ పరిధిలోని గ్రామాల్లో కుటుంబాలను కలిసి సర్వేలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ అప్‌డేట్‌, పీ4(బంగారు కుటుంబాలు)తో పాటు గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు, తాజాగా వార్డుల వారీగా ఓటరు జాబితా రూపకల్పన కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శులే చేయాల్సి ఉండటం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అధిక సమయం తీసుకుంటున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నవశకం’ పేరిట సాగిన సర్వేను ప్రస్తుత కూటమి ప్రభుత్వం యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేగా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరు విధులు నిర్వహించిన దృష్ట్యా, అప్పట్లో చాలా సులభంగా సర్వే చేపట్టారు. ప్రస్తుతం వలంటీరు వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిన నేపథ్యంలో భారమంతా సచివాలయ ఉద్యోగులపైనే పడింది. ఒక కుటుంబానికి ఈ సర్వే పూర్తి చేయాలంటే కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలోని అందరు వ్యక్తులకు చెందిన సమాచారాన్ని 20 నుంచి 30 డాక్యుమెంట్ల రూపంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఒక ఉద్యోగి సగటున వంద నుంచి వెయ్యి కుటుంబాలను సర్వే చేయాల్సి ఉందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు మనిషి జీవించి ఉన్నాడా, లేదా? అని నిర్ధారించుకునేందుకు ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో విధిగా బయోమెట్రిక్‌ తీసుకోవాల్సి ఉండటంతో ప్రక్రియ ప్రహసనంగా మారుతోందంటున్నారు. అలాగే పీ4(బంగారు కుటుంబాలు)లను గుర్తించే బాధ్యత కూడా వీరి నెత్తిపైనే ఉంది.

ఆన్‌లైన్‌ పన్ను చెల్లింపులతో

ఇబ్బందులు

ప్రస్తుతం అన్ని రకాల పన్నులను ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు తమ మొబైల్‌ ద్వారా పన్నులు చెల్లిస్తున్నారు. ఇంటి నెంబర్‌ లేదా ఇతర అంశాలను పూరించే సమయంలో చిన్నపాటి పొరపాట్లు చేస్తే మరో 24 గంటల పాటు సర్వర్‌ స్తంభిస్తోంది. అలాగే పలు ప్రాంతాల్లో సర్వర్లు పనిచేయక పోవడం వల్ల కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఆలూరులోని గ్రామ సచివాలయం

సవాలుగా పన్ను వసూళ్లు

తాజాగా ఓటరు జాబితా రూపకల్పన

ఓ వైపు సర్వేలు, మరో వైపు పన్ను వసూళ్లకు లక్ష్యాలు, ఇంకో వైపు ఓటరు జాబితాలను మార్చి 9 నాటికి రూపొందించాలని డెడ్‌లైన్‌ విధించారు.

దీంతో పంచాయతీ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ రకమైన ఒత్తిడికి లోనవుతుంటే ఐవీఆర్‌ఎస్‌ మరో రకంగా భయపెడుతోంది.

గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.

తీవ్ర పని ఒత్తిడి కారణంగా ఏ గ్రామ పంచాయతీలోనైనా పారిశుద్ధ్యంపై నెగిటివ్‌గా తెలియజేస్తే, సంబంధిత కార్యదర్శులపై వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడకపోవడం గమనార్హం.

కంటిమీద కునుకులేని సచివాలయ ఉద్యోగులు

గ్రామాల్లో పన్ను వసూళ్లు పంచాయతీ కార్యదర్శులకు సవాల్‌గా మారింది. మార్చి 20వ తేదిలోగా జిల్లాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్‌అండ్‌ఆర్‌డీ కమిషనర్‌ ప్రత్యేకంగా పన్ను వసూళ్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టింది. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పన్నులు, పన్నేతరములు కలిపి రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.17 కోట్లను వసూలు చేశారు. ఇంకా 20 రోజుల్లో రూ.12 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. పన్ను వసూళ్లలో ఎవరు అశ్రద్ధ చూపినా, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

సెలవులు లేవని జారీ చేసిన ఉత్తర్వు

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయ1
1/2

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయ

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయ2
2/2

కర్నూలు నగరం డాక్టర్స్‌ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement