నిబంధనల మేరకే పనులు చేపట్టాం
భారత ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్ల పనుల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనుల్లోను నిబంధనల మేరకే చేశాం. దేవస్థానానికి సీఎం పేషీ నుంచి పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదును పరిశీలించి క్షుణ్ణంగా అన్నింటికీ వివరాలు సమర్పించాం. అన్ని పనులకు ఆన్‌లైన్ ద్వారా ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే టెండర్లు నిర్వహించాం. ప్రధాని భద్రతా అధికారులైన ఎస్పీజీ సూచనల మేరకు మూడంచెల భద్రత కోసం పటిష్టంగా బారికేడింగ్ ఏర్పా టు చేశాం. భ్రమరాంబా అతిథిగృహంలో ఐదు గదులకు ఫర్నిచర్ మార్చాం. టీటీడీ ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారమే పెయింటింగ్ పనులు చేపట్టాం.
– ఎం.నరసింహారెడ్డి, శ్రీశైల దేవస్థాన
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్


