దిగువ అహోబిలంలో..
దిగువ అహోబిలంలో 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ పలికారు. శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనం చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహాదేసికన్, వేదపండితులు, అర్చక బృందాలు స్వస్తివాచనం పూజ లు చేశారు. అంతకు ముందు ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామిని ఉభయ దేవురులతో యాగశాలలో కొలువుంచి తిరుమంజనం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టనున్నారు.
దిగువ అహోబిలంలో..


