మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యా లయంలో మంగళవారం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఎస్పీ ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్‌ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని సొత్తును రికవరీ చేయాలన్నారు. రికవరీ అయిన సెల్‌ఫోన్లను ప్రతినెల మొదటిరోజు జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి బాధితులకు నేరుగా అందించాలన్నారు. రాబోయే లోక్‌ అదాలత్‌ సందర్భంగా కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాలేజీలు, వసతి గృహాలు, ఆలయాలు, చర్చి, మసీదు పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సమా వేశంలో నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ జావళి, డీఎస్పీలు రామంజి నాయక్‌, శ్రీనివాసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement