అహోబిలంలో టీడీపీ ‘భూ’తాలు!
ఇక్కడ చెట్లు తొలగించి శుభ్రం చేసిన ఈ స్థలం అహోబిలం పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి దేవస్థాన నిర్వాహకులు కేటాయించినది. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్లే బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ స్థలంపై గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కన్ను పడింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వెంటనే అక్కడున్న కంపచెట్లు తొలగించి మన్ను తోలుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ‘పోలీసు స్టేషన్ స్థలమే కబ్జా చేస్తావా’ అని అడగడంతో ఈ విషయం దేవస్థానం వారివద్దనే తేల్చుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ స్థలం మైనర్ ఇరిగేషన్ పరిధిలోని మఠంవారి చెరువు (మఠమోల్ల చెరువు)ది. చెరువు బాగోగులు చూసుకునేందుకు కార్యాలయం ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులు కోరితే 282 సర్వేనంబర్‌లో రెండు ఎకరాలు కేటాయించారు. ఇది అన్యాక్రాంతమవుతూ 0.80 ఎకరాలే మిగిలింది. ఈ స్థలం విలువ రూ. కోటి పైనే ఉండటంతో గ్రామంలోని 20 మంది టీడీపీ నాయకులు కంచె ఏర్పాటు చేసుకున్నారు. అందులో షెడ్లు (బంకులు) వేస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బాడుగకు ఇస్తే నెలనెలా రూ. లక్షల్లో వస్తాయని టీడీపీ నాయకులే చెబుతున్నారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన
అధికార పార్టీ నాయకులు
జలవనరుల భూమికి ఎసరు
పోలీస్ స్టేషన్ స్థలం స్వాహాకు
సన్నాహాలు
వారం రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నా
కన్నెత్తి చూడని అధికారులు
అహోబిలంలో టీడీపీ ‘భూ’తాలు!


