లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
కర్నూలు: పది సంవత్సరాలకు పైగా పెండింగ్‌లోని సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.కబర్ధి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం ఆయన స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులలో పెండింగ్‌లోని సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్‌లను చేసి ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కక్షిదారులు ఈ అవకాశా న్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


