భక్తిశ్రద్ధలతో గురువైభోత్సవాలు
మంత్రాలయం: గురు వైభోత్సవాలు ఐదో రోజు శ్రీమఠంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాన్ని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి కుమారగౌడు దర్శనం చేసుకున్నా రు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. ఆయనకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్రం, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్ర జ్ఞాపిక అంజేశారు. ఐదో రోజు ప్రముఖులకు ప్రశస్తి అవార్డులు అందజేశారు. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాదు, సీనియర్ న్యాయవాది పి.రఘరాం పీఠాధిపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.


