దండిస్తారా.. ప్రోత్సహిస్తారా! | - | Sakshi
Sakshi News home page

దండిస్తారా.. ప్రోత్సహిస్తారా!

Feb 21 2026 7:48 AM | Updated on Feb 21 2026 7:48 AM

దండిస్తారా.. ప్రోత్సహిస్తారా!

దండిస్తారా.. ప్రోత్సహిస్తారా!

శ్రీశైలం ప్రాజెక్ట్‌: టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. ఆడపిల్లలను బయటకు పంపాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలను సైతం దారుణంగా హత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన ఇటీవల కాలంలో అధికమయ్యాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుంటే.. ప్రశ్నిస్తామన్న పవన్‌కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌లలో బిజీ అయిపోవడం గమనార్హం. ఎవరైనా అమ్మాయిలను వేధిస్తుంటే ఏం చేస్తారు, బాధిత కుటుంబానికి అండగా నిలిచి అందుకు కారణమైన యువకునికి చీవాట్లు పెడతారు. కానీ ఇది టీడీపీ ప్రభుత్వం, బాధిత కుటుంబానికి కాకుండా, వేధింపులకు గురిచేస్తున్న యువకుడికే వత్తాసు పలకడం వివాదానికి కారణమైంది. ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబ సభ్యులు సదరు టీడీపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన స్థానిక ఎమ్మెల్యే, యువకుడికి అండగా నిలిచిన టీడీపీ నేతను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించడం ఈ ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. వివరాలివీ.. లింగాగట్టు గ్రామంలో మత్స్యకార కుటుంబానికి చెందిన ఓ అమ్మాయికి టీడీపీకి చెందిన చిట్టిబాబు కుమారుడు నాని తరచూ మెసేజీలు పంపుతూ వేధిస్తున్నాడు. ఈ విషయమై అమ్మాయి బంధువులు స్థానిక టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో అబ్బాయి తరపున స్థానిక టీడీపీ నాయకుడు పోలయ్య వత్తాసు పలకడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి మాత గుడి సమీపంలో పోలయ్యపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన అతన్ని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆకతాయి తరపున వత్తాసు తీసుకున్న పోలయ్యను ఆసుపత్రికి వెళ్లి పరాామర్శించడం విమర్శలకు తావిస్తోంది. తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించలేకపోయినా ఎమ్మెల్యే, వేధింపులకు పాల్పడే వారికే అండగా నిలవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఇకపోతే అమ్మాయి తరపు కేసును పట్టించుకోని పోలీసులు, పోలయ్య కేసును మాత్రం ఆగమేఘాలపై స్వీకరించడం గమనార్హం. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందో ఇదే తాజా ఉదాహరణ.

యువతికి ఆకతాయి వేధింపులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

అండగా నిలిచిన ఓ టీడీపీ నేత

సహనం కోల్పోయి దాడికి పాల్పడిన

అమ్మాయి బంధువులు

ఆసుపత్రిలో పరామర్శించిన

ఎమ్మెల్యే బుడ్డా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement