శ్రీశైలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు!
శ్రీశైలం ప్రాజెక్ట్: నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని దోర్నాల వరకు ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీశాఖ గతంలో ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఎలాంటి వస్తువులను అనుమతించకుండా దోర్నాల, లింగాలగట్టు అటవీ శాఖ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. ఏదైనా ప్లాస్టిక్ వస్తువు దొరికితే వాహనం సీజ్ చేయడంతో పాటు, జరిమానా విధిస్తారు. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్‌లు ఎక్కడా కనిపించకుండా అటవీశాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. ముఖ్యంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని శ్రీశైల దేవస్థానం బయో వాటర్ బాటిళ్ల సరఫరాకు గత రెండు సంవత్సరాల క్రితం టెండర్లు పిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ వీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ రహిత కోర్ ఏరియా శ్రీశైలంలోకి మహాశివరాత్రి బ్రహ్సోవాలలో లక్షలాది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను దేవస్థానం ఆధ్వర్యంలో సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది.
దేవస్థాన అధికారులు
సిద్ధం చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు


