శాస్త్రోక్తంగా పల్లకీ సేవ | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

శాస్త

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు అధిష్టింపజేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

శ్రీశైల దేవస్థానానికి రూ.3 లక్షల విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు రూ.3 లక్షల విరాళాలను ఆదివారం అందించారు. అన్నప్రసాద వితరణ పథకానికి గుంటూరుకు చెందిన పి.రాజేశ్వరరావు రూ.1,01,116 విరాళాన్ని ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఎం.అవినాష్‌ గో సంరక్షణ నిధి పథకానికి రూ.లక్ష, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

యువకుడి ఆత్మహత్య

ఆదోని అర్బన్‌: మండలంలోని కడితోట గ్రామానికి చెందిన రామకృష్ణ, ఈరమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్‌(21) కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దతుంబలం ఎస్‌ఐ విద్యశ్రీ తెలిపిన వివరాలు.. శ్రీకాంత్‌ రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత ఏడేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. ఆదివారం కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిగేలా విలపించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ

కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ అద్దె బస్సు, టిప్పర్‌ ఢీకొన్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. బస్టాండ్‌లో నుంచి నంద్యాలకు బయలు దేరిన ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్‌ ఔట్‌ గేటు నుంచి బయటకు వస్తుండగా ముదిగేడు రహదారి వైపు నుంచి బస్టాండ్‌ వైపు టిప్పర్‌ వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు, టిప్పర్‌ ఢీ కొనడంతో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజ్‌ కావడంతో ఇరువురు డ్రైవర్లు వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ 1
1/3

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ 2
2/3

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ 3
3/3

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement