● మాజీ మంత్రి బుగ్గన చొరవతో ప్యాపిలిలో సెంట్రల్ లైటింగ
టీడీపీ నేతల ‘సెంట్రల్’ క్రెడిట్ చోరీ
డోన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై, పూర్తయిన పనుల క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రారంభోత్సవాలు చేయడం టీడీపీ నేతలకు షరా మామూలుగా మారింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద 2024 మార్చి 24న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ప్యాపిలికి సెంట్రల్ లైటింగ్ సిస్టంను కేటాయించి, పూర్తి చేయించారు. అయితే ఈ క్రెడిట్‌ను చోరీ చేసేందుకు టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. డోన్ మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ కింద చిరు వ్యాపారుల కోసం ప్లాట్‌ఫారంతో పాటు ఫ్లైఓవర్ సుందరీకరణ కోసం రూ.కోటిని మాజీ మంత్రి బుగ్గన మంజూరు చేయించిన విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తుచేస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేసి, పైపులైన్ల నిర్మాణాలను పూర్తిచేయడమే కాక బేతంచెర్ల పట్టణానికి గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా శుద్ధజలాన్ని మాజీ మంత్రి బుగ్గన అందించారు. దీనిని కూడా తమ ఘనతగా చెప్పుకునేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసి స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు తప్ప నయాపైసా కూడా డోన్ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్వయంగా టీడీపీ నాయకులే చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
● మాజీ మంత్రి బుగ్గన చొరవతో ప్యాపిలిలో సెంట్రల్ లైటింగ


