కనులపండువగా తిరుచ్చి మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా తిరుచ్చి మహోత్సవం

Feb 21 2026 7:48 AM | Updated on Feb 21 2026 7:48 AM

కనులపండువగా  తిరుచ్చి మహోత్సవం

కనులపండువగా తిరుచ్చి మహోత్సవం

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో పాల్గుణ శుక్రవారం తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు, పండితులు, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. తిరుచ్చి మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్షల్లో 30 మంది విద్యార్థులు డిబార్‌

కర్నూలు(సెంట్రల్‌): రాయలసీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో భారీ స్థాయిలో విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. శుక్రవారం జరిగిన పరీక్షలో ఏకంగా 30 మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారు.

సోలార్‌ సమస్యలపై 1912కు కాల్‌ చేయండి

కర్నూలు(అగ్రికల్చర్‌): సోలార్‌ విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం దిశగా ఏపీఎస్‌పీడీసీఎల్‌ చర్యలు చేపట్టిందని చైర్మన్‌, సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు అనేక సమస్యలు, అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912కు ఫోన్‌ చేసి వినియోగదారులు తాము ఎదుర్కొంటు న్న సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇంటరాక్షన్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ద్వారా ఫోన్‌/మొబైల్‌ స్క్రీన్‌పై 5 అంకెను నొక్కి సోలార్‌ విద్యుత్‌ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

జనన, మరణాలు నమోదు చేయించుకోండి

కర్నూలు(హాస్పిటల్‌): జనన, మరణాలను 21 రోజుల్లో తప్పక నమోదు చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 రోజుల్లో నమోదు చేయించుకుంటే ఉచితమన్నారు. ఆ తర్వాత నుంచి 30 రోజుల్లో నమోదుకు రూ.25 రుసుం చెల్లించాలని, అనంతరం ఏడా ది వరకు రూ.250 అపరాధ రుసుముతో పాటు అఫిడవిట్‌ అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement