కమనీయం.. కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కల్యాణోత్సవం

Mar 1 2026 7:27 AM | Updated on Mar 1 2026 7:27 AM

కమనీయ

కమనీయం.. కల్యాణోత్సవం

కల్యాణ మండపానికి వస్తున్న అమ్మవారు

కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్ల తిరు కల్యా ణోత్సవం ఎగువ అహోబిలంలో వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్‌ శఠకోప రంగనాధయతీంద్ర మహదేశికన్‌ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ఎదురుకోళ్ల కార్యక్రమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవారిని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చి కొలువుంచారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ తంతు పూర్తిచేశారు. అనంతరం స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు. చివరగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి కల్యాణ మహోత్సవాన్ని ముగించారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం తొట్టి తిరుమంజనం, రాత్రి అశ్వవాహన సేవలు కొనసాగుతాయి. దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, సాయంత్రం గజవాహనం సేవ, రాత్రి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు.

ముత్తైదువుల ఆశీర్వాదం కోసం తాళి చూపుతున్న అర్చకుడు

కమనీయం.. కల్యాణోత్సవం1
1/3

కమనీయం.. కల్యాణోత్సవం

కమనీయం.. కల్యాణోత్సవం2
2/3

కమనీయం.. కల్యాణోత్సవం

కమనీయం.. కల్యాణోత్సవం3
3/3

కమనీయం.. కల్యాణోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement