శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
● నలుగురిపై కేసు నమోదు
శ్రీశైలం: స్థానిక కొత్తపేట, మేకలబండ ప్రాంతాల్లో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో 85 మద్యం బాటిళ్లు, 34 లీటర్ల నాటు సారా పట్టుబడింది. సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి మేకల బండకు చెందిన పోతుల సాయి దగ్గర నుంచి 34 లీటర్ల నాటు సారా, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మంజుల లలిత ఇంటి వద్ద 45 మద్యం సీసాలు, అదే ప్రాంతానికి చెందిన సంపంగి మహేశ్వరి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలు గురు నిందితులపై దేవదాయ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు.
ఘాట్ రోడ్డులో నిబంధనలు పాటించాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించే వాహనదారులు అటవీ సంరక్షణ నిబంధనలు పాటించాలని సబ్ డీఎఫ్‌ఓ బబిత శుక్రవారం తెలిపారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల వేల అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళ్తున్నారని, ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేస్తున్నామన్నారు. అటవీ మార్గంలో 30 కి.మీ వేగానికి మించి వెళ్ల వద్దని, రహదారిపై వన్యప్రాణులు కనిపిస్తే వాహనాలను నిలిపేయాలని సూచించారు. తీవ్రంగా హారన్‌లు మోగించడం, అడవిలో మల విసర్జనకు వెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అటవీ చట్టాలను అతిక్రమించే డ్రైవర్లకు రూ.500 – రూ.1000 వరకు అపరాధ రుసుం విధిస్తామన్నారు.
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత


