ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
● బాలోత్సవాలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్‌లో మంగళవారం బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు అంశాలపై ఆలోచించే ప్రదర్శనలు చేపట్టారు. ప్రారంభ కార్యక్రమానికి డీఈఓ జనార్దన్‌రెడ్డి, ఎంఈఓలతో పాటు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు రాకేష్‌రెడ్డి, క్రాంతి, మౌలాలిరెడ్డి, భాస్కర్ తది తరుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రారంభ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. పాఠశాలల్లో పాఠాలు వినడమే కాకుండా ఆట పాటల్లో ఆనందంగా గడపాలని, అప్పుడే చక్కగా చదవగలుగుతారన్నారు. రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటున్నారనార్రు. శాస్త్ర సాకేంతిక రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో మూడ విశ్వాసాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు వాస్తవ పరిస్థితులను గమనించాలన్నారు. విద్యార్థులు బట్టి చదువులకు బలైపోతున్నారని, వాటి నుంచి విముక్తి పొందడానికి ఈ కార్యక్రమాలు దోహదపడుతాయ న్నారు. మొదటి రోజు వ్యాసరచన, చిత్రలేఖనం, కథా రచన, కవితారచన, ఏకపాత్రాభినయం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి, విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మౌలాలి, గురుస్వామి, భగత్ సింగ్ గ్రంథాలయ ట్రస్ట్ చైర్మన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..


