కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

బండిఆత్మకూరు: మండల పరిధిలోని సింగవరం గ్రామ సమీపంలో ఉన్న కేసీ కెనాల్‌ వద్ద ఆదివారం నారిపెద్ద హేమంత్‌ (17) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ జగన్మోహన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గల్లంతైన యువకుడుది ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామం. అయితే శనివారం రాత్రి అతనితోపాటు 20 మంది యువకులు గ్రూప్‌గా ఏర్పడి సింగవరం గ్రామానికి వచ్చి బస చేశారు. సింగవరం గ్రామం నుంచి వీరందరూ నడుచుకుంటూ బండిఆత్మకూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కేసీ కెనాల్‌ మెట్ల వద్ద కాళ్లు కడుక్కోవడానికి హేమంతు దిగి కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీంతో పక్కనున్న యువకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసీ కెనాల్‌ లో నీటి ప్రవాహం తగ్గించి డ్రోన్ల ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు వచ్చి కెసి కెనాల్‌ సమీప గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement