నేడే ‘బార్‌’ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడే ‘బార్‌’ ఎన్నికలు

Feb 13 2026 3:59 AM | Updated on Feb 13 2026 3:59 AM

నేడే ‘బార్‌’ ఎన్నికలు

నేడే ‘బార్‌’ ఎన్నికలు

445 మంది ఓటర్లు

ఆరు పోలింగ్‌ బూత్‌లు

నంద్యాల(వ్యవసాయం): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగే ఏపీ స్టేట్‌ బార్‌ కౌన్సిలర్‌ ఎన్నికలకు నంద్యాల బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పోలింగ్‌ ఆఫీసర్‌ హుసేన్‌బాషా, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశ మౌళిరెడ్డి, వెంకటేశ్వర్లు, తోటా మురుళీ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులు 445 మంది ఓటర్లు ఉన్నారని, అందుకోసం ఆరు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారన్నారు. ఓటింగ్‌ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలు, ఓటర్ల జాబితా, సీలింగ్‌ కిట్లు ఏపీ బార్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నుంచి నంద్యాల బార్‌ అసోసియేషన్‌కు చేరుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది బార్‌ మెంబర్లుగా పోటీలో ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు సీరియల్‌ నంబర్లను క్యాపిటల్‌ లెటర్స్‌లో మాత్రమే రాయాలన్నారు. కచ్చితంగా ఐదుగురిని గుర్తించాలని, అంతకన్నా తక్కువ అయితే ఓటు చెల్లదన్నారు. పోలీసుల భద్రత ఉంటుందన్నారు. నంద్యాల జిల్లాలో బార్‌ అసోసియేషన్‌ నుంచి ఎం.విజయశేఖర్‌రెడ్డితో పాటు మరొకరు, ఆళ్లగడ్డ నుంచి ఒకరు, డోన్‌ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు చెప్పా రు. జిల్లాలో ఏడు బార్‌ అసోసియేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లు కచ్చితంగా ఏపీ బార్‌ కౌన్సిల్‌ గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement