బాలికల్లో పోటీతత్వం పెరగాలి
వెల్దుర్తి: సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు బాలికల్లో పోటీతత్వం పెరగాలని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్, సమగ్రశిక్ష జిల్లా అధికారి ఎన్. లోకరాజు, రాష్ట్ర ప్రభుత్వ అబ్జర్వర్ జయలక్ష్మి, జిల్లా జీసీడీఓ మేరి స్నేహలతతో కలిసి స్థానిక పీఎంశ్రీ బాలికల జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సైన్స్‌ల్యాబ్‌లో విద్యార్థినులు చేసిన ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థినులతో మాట్లాడి కంప్యూటర్స్, గ్రంథాలయం, సాంకేతిక విద్య, క్రీడలపై ఆసక్తిని తెలుసుకున్నారు.
కర్నూలు: ఓ కేసు విషయంలో స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది పవన్‌కుమార్‌పై దాడి చేసిన సీఐ విక్రమసింహాపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. 24 గంటల్లో సీఐపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హుసేన్ పీరా చెప్పారని, అయితే ఎలాంటి చర్యలు లేకుండా కాలయాపన చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. మరోవైపు బాధిత న్యాయ వాది పవన్‌కుమార్ ఇంటికి ఇద్దరు సీఐలు వెళ్లి బెదిరించి రాజీ అయినట్లు వీడియో తీసి బార్ అసోసియేషన్ అధ్యక్షుల పేరుతో జిల్లా పోలీసు అధికారులకు పంపినట్లు న్యాయవాది పవన్ మీడియా ఎదుట ఆరోపించారు. ఈ విషయంలో మరో సీఐ జోక్యం చేసుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం నేరమని, ఇందులో రాజీ ధోరణి కాకుండా పోరాటం చేయాలని న్యాయవాద సంఘం సభ్యు లు తీర్మానం చేశారన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వరకు తమ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద సీఐ విక్రమసింహాకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.


