కల్లూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు చేపట్టనున్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పెంచి పేదలపై భారం మోపడాన్ని నిరసిస్తూ కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసం నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేస్తారు. పాణ్యం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు.


