నానాటికి పెరుగుతున్న పట్టణ జనాభా, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో రైల్వే గేట్లు పడటంతో గంటల పాటు అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ చిక్కుముడిని శాశ్వతంగా ఎప్పుడు పరిష్కరిస్తారని వేచిచూస్తున్నాం.
– బాలతిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, ధర్మవరం
మూడు ప్రధాన రైల్వే గేట్ల మధ్య ఉన్న పాతపేట టీడీపీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మాజీ మంత్రి బుగ్గన చొరవతో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడినా కూటమి ప్రభుత్వంలో పనులు సాగడం లేదు. ఇది ముమ్మాటికీ టీడీపీ పాలకుల వైఫల్యమే.
– ఆర్‌ఈ రాజవర్దన్, స్థానికుడు, పాతపేట
అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన చేయడం మూలంగా ప్రజల విలువైన సమయం, డబ్బు వృథా అవుతోంది. ట్రాఫిక్‌లో ఒక్కసారి వాహనం చిక్కుకుంటే బయటపడేందుకు గంటల సమయం పడుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్యను టీడీపీ పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. అభివృద్ధిని అడ్డుకునే వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.
– బాషా, ఆటోడ్రైవర్, డోన్


