రూ.కోటి విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

కర్నూలు: నిషేధిత కూల్‌ లిప్‌ అనే గుట్కా నిల్వలపై నాలుగో పట్ట ణ పోలీసులు దాడులు చేసి రూ.కోటి విలువ చేసే నిల్వలను సీజ్‌ చేశారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చి స్థానిక హనుమాన్‌ కాటా వెనుక ఓ గో డౌన్‌లో నిల్వ చేసి కర్నూలు నగరంతో పాటు చుట్టుముట్టు పల్లెలకు గుట్కా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో శనివారం గోదాముపై దాడులు నిర్వహించారు. ఒక్కొక్క సంచిలో రూ.50 విలువ చేసే 193 బ్యాగులలో గుట్కా నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటితో పాటు గోడౌన్‌ను సీజ్‌ చేశారు. ఇవి చూయింగ్‌ గమ్‌ తరహాలో ఉంటాయి. వ్యాపారి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. తన వ్యాపారం సక్రమమే అని వెంకటేశ్వర్లు తెలపడంతో అందుకు సంబంధించిన రికార్డులను తెప్పించి పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా కిరాణం అంగళ్లు, బీడీ బంకులకు సరఫరా చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement