ఉరేసుకుని ఆత్మహత్య
బేతంచెర్ల: ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన బేతంచెర్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన యువకులు షేక్షావలి, ట్రాక్టర్ డ్రైవర్ కొడిగంటి చిన్న స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరు కలసిమెలసి ఉండేవారు. షేక్షావలి శనివారం రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మిత్రుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి చెందిన డ్రైవర్ చిన్న (25) అనురాధ థియేటర్ సమీపంలోని తన ఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య చిలకమ్మతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


