బొమ్మలసత్రం: లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)పై ప్రజలకు అవగాహన కల్పిస్తే చోరీల కు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ జావలి ఆల్ఫోన్స్ అన్నారు. గురువారం స్థాని క కార్యాలయంలో సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇళ్లలో ఎవరూ లేనప్పుడు ఎక్కువగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లు వదిలి వెళ్లే యజమానులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీసు యాప్‌ను ఎలా వినియోగించాలో పోలీసులు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ యాప్ ద్వారా ఇల్లు వదలి బయటకు వెళ్లేప్పుడు రిక్వెస్ట్ పంపితే కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బందికి చేరడంతో ఇంటి వద్దకు వచ్చి అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కెమెరాలకు మోషన్ డిటెక్షన్ సెన్సార్‌లు ఉండటంతో ఇంటి వద్ద ఏ చిన్న అలజడి వచ్చినా పోలీసు కంట్రోల్ రూంలకు అలర్ట్ మెసేజ్ వెళ్తుందన్నారు. సమావేశంలో సీఐలు సుధాకర్‌రెడ్డి, గోపాలకృష్ణ, అస్రార్‌బాషా, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


