శ్రీశైల క్షేత్రంలో స్వచ్ఛత భేష్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైల క్షేత్రంలో స్వచ్ఛత భేష్‌

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

శ్రీశైలం: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో చేపడుతున్న చర్యలు భేష్‌ అని ఆదానీ అనుబంధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నో ప్లాస్టిక్‌ – సేవ్‌ నేచర్‌ నినాదంతో ఆ సంస్థ ప్రతినిధులు నలుగురు 12 జ్యోతిర్లింగాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన వారు పారిశుధ్య పనులు, ప్లాస్టిక్‌ నివారణ చర్యలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తర్వాత నివేదిక తయారు చేసి ఈవో శ్రీ నివాసరావును కలిసి అందజేశారు. బృందంలో గుజరాత్‌కు చెందిన హరినాథ్‌ నబ్బవ, కపిల్‌ గోర్‌, మకుందనాథ్‌, సావన్గర్‌ గో స్వామి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement