మగ శిశువు లభ్యం | - | Sakshi
Sakshi News home page

మగ శిశువు లభ్యం

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

ఉయ్యాలవాడ: మాయలూరు గ్రామంలోని ఓ పాడుబడిన గృహంలో మగశిశువు లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెన్నపూస శంకర్‌రెడ్డికి చెందిన పాడుబడిన గృహం నుంచి నవజాతశిశువు ఏడుపు వినిపించింది. సమీపంలో నివసించే నాగేశ్వరమ్మ ఆ శబ్దం విని గృహాలు వెతుకుంటూ వెళ్లింది. పాడుబడిన గృహం లోపలికి వెళ్లి చూడగా మగ శిశువు కనిపించా డు. వెంటనే ఆ శిశువును ఎత్తుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించడంతో శిశువును తిరిగి గ్రామానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నందిరెడ్డి ఈశ్వరరెడ్డి ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఆ తల్లి పేగు బంధాన్ని తెంచుకుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement