దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) బ్యాక్‌లా గ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27 గ్రూపు –4 పోస్టులు, 11 క్లాస్‌ –4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ www.kurnool.ap.gov.in, www. nandyal.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు కార్యాలయ నోటీసు బోర్డులో కూడా ఉంచా మన్నారు. వివరాలకు 08518 – 277864 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. అర్హులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను అందించాలన్నారు. అలాగే ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన ప్రకటనలో సవరణ చేశామన్నాన్నారు. టైపిస్టు పోస్టుకు టైపు రైటింగ్‌ ఇంగ్లిష్‌ మరియు తెలుగు హయ్యర్‌ గ్రేడ్‌ సర్టిఫికేట్‌ లేకున్నా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ ఉన్నా అర్హులేనన్నారు. టైపిస్టు పోస్టుకు ఉద్యోగం పొందిన వారికి కంప్యూటర్‌ ప్రొఫెషనరీ టెస్ట్‌(సీపీటీ) నిర్వహిస్తామన్నారు.

డ్రోన్‌ సిటీ పనులను

త్వరగా పూర్తి చేయండి

ఓర్వకల్లు: డ్రోన్‌ సిటీ తొలి దశ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు సంబంధించి మండలంలోని కొమరోలు, చింతలపల్లె గ్రామాల పరిధిలో చేపడుతున్న నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాలలో భాగంగా రోడ్లు, విద్యుత్‌, నీటి సరఫరా తదితర పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రోన్ల తయారీ, టెస్టింగ్‌, పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. మొత్తం మూడు దశల్లో నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు ఏపీఐఐసీ డీఈ సందీప్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌, మండల సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement