కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ (ఏపీవీఏ) ఫోర్త్–4 ఉపాధ్యక్షుడిగా సహాయ సంచాలకులు గుండంపాటి రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామానికి చెందిన వారు. కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌గా, సహాయ సంచాలకులుగా దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫోర్త్–4 (రాయలసీమ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ స్థాయిలో పశువైద్యులు ఎదుర్కొంటున్న వివిద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.


