బాలుడి అదృశ్యంపై ‘సిట్‌’ విచారణ | - | Sakshi
Sakshi News home page

బాలుడి అదృశ్యంపై ‘సిట్‌’ విచారణ

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కౌతాళం: బాలుడి అదృశ్యంపై సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) విచారణ చేపట్టింది. ఇందుకోసం సిట్‌ సభ్యులు ఆదివారం బదినేహాల్‌ గ్రామానికి వెళ్లారు. పొలానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లి బాలుడు మాల రవీంద్ర (17) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 2024 నవంబర్‌ 13న కౌతాళం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తన కుమారుడి మిస్సింగ్‌ కేసులో ఎలాంటి పురోగతి లేదని రవీంద్ర తల్లి మాల గంగమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 13 మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు ఆదివారం బదినేహాల్‌కు వచ్చి గంగమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అలాగే తుంగభద్ర దిగువ కాలువ వద్దకు కూడా వెళ్లి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement