పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

డోన్‌ టౌన్‌: ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ రాడ్‌ విరిగి పోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. డోన్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం యాడికికి బయలుదేరింది. మార్గమధ్యంలో గోసానిపల్లె గ్రామ సమీపంలో స్టీరింగ్‌ రాడ్‌ విరిగి పోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లగా డ్రైవరు చాకచక్యంగా వ్యహరించి ప్రమాదాన్ని తప్పించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డోన్‌ డిపోలో ఎక్కువగా పాత బస్సులు ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని కార్మికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్‌ పరిస్థితిని సమీక్షించి ప్రయాణికులను అదే రూట్‌లో వెళ్లే రాచర్ల బస్సులో తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement