బనగానపల్లె: మండలంలోని నిలువుగండ్ల గ్రామ శివారు ప్రాంతంలో ఆటో బోల్తాపడి ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం శివవరం గ్రామానికి చెందిన సుశీలమ్మ సోమవారం సాయంకాలం ఆటోలో స్వగ్రామం వెళ్తున్నారు. నిలువుగండ్ల గ్రామం దాటిన తరువాత ఆటో డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న సుశీలమ్మ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుశీలమ్మకు కుమారుడు, కూతురు ఉన్నారు.


