కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే యూరియా క్రయవిక్రయాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈనెల 14న ‘సాక్షి’లో ‘లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసా య శాఖ కమిషనరేట్ స్పందించింది. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి యూరియాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెప్పించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతానికి యూరియాకు ఎలాంటి సమస్య లేదని, డిమాండ్‌కు తగ్గ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.


