నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 18వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నా రు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ప్రశాంతంగా తాలీం–ఏ–హునర్‌ పరీక్ష

నంద్యాల(అర్బన్‌): పట్టణంలోని నేషనల్‌ డిగ్రీ కళాశాల, బైర్మన్‌ వీధిలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో ఆదివారం జరిగిన తాలీం–ఏ–హునర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 671 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 611 మంది హాజరయ్యారు. కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీ డియెట్‌, ఐఐటీ, జేఈఈ, నీట్‌ శిక్షణ కోసం పేద ముస్లిం విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను డీఆర్‌ఓ రామునాయక్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్‌ సబిహాపర్వీన్‌లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్‌ ఎడ్యుకేషన్‌ మిషన్‌ అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెస్టులో ఎంపికై న వారికి కార్పొరేట్‌ కళాశాలల్లో వంద శాతం ఉచిత ప్రవేశాలు ఉంటాయన్నారు.

ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నంద్యాల రూరల్‌, కోవెలకుంట్ల, ఉయ్యలవాడల్లో 42.5, చాగలమర్రిలో 42.4, పగిడ్యాల, జూపాడుబంగ్లా, సంజామలల్లో 42.3, మహనందిలో 42.2. కౌతాళంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మద్దికెరల్లో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

నందికొట్కూరు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి లలిత వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం డీసీహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులతో మర్యాదగా మెలగాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

రెండేళ్లు అయినా లోకేష్‌ హామీకి దిక్కేలేదు

నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటి ముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని యువగళం సభలో లోకేష్‌ ఇచ్చిన హామీకి రెండేళ్లు అయినా దిక్కు లేదని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారానికి 53వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘం నాయకుడు జయన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూటమి నేతలు నమ్మించి వంచించారన్నారు. నీటిముంపు నిరుద్యోగులను చంద్రబాబు పట్టించుకోకపోవడం మోసం చేయడేమనన్నారు. దీక్షలో నాగేంద్రుడు, రాజారావు, నారాయణ, రవి, మహమ్మద్‌ రఫి, తదితరులు కూర్చున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement