గడివేముల: మండల కేంద్రం గడివేములకు చెందిన లవంగాల మాబు సా (109) అనే శతాధిక వృద్ధుడు అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో నే కురు వృద్ధుడు అయి న ఈయన చనిపోవడానికి ముందు వరకు వ్యవసాయం పనులు చేసేవారు. ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా భార్య రమిజాబీ 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. గ్రామానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాలచెన్ని, పలువురు మాబుసా మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
కురువ విద్యార్థులకు
ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): కురువ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2025–26లో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500లకు పైగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివి 550కు పైగా మార్కులు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో చదివి 850, ప్రైవేటు కళాశాలల్లో చదివి 900కు పైగా మార్కులు తెచ్చుకున్న వారికి పురస్కారాలు ఇస్తామన్నారు. అర్హులు తమ మార్కుల మెమో, కులం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను ఈ నెల 10వ తేదీలోగా సెల్: 94407 56199, 90327 41194 నెంబర్లకు వాట్సాప్ చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన బాలికలకు 10 మందికి ఉచిత బోధన సౌకర్యం కల్పిస్తామని శ్రీమేధ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కె. రాము తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కె. కిష్టన్న, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న తదితరులు పాల్గొన్నారు.
10న జిల్లా స్థాయి
చెస్ పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 10వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఎన్‌ఆర్‌జీ చెస్ అకాడమీ గౌరవాధ్యక్షుడు రాజేష్, డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పట్టణంలోని నెరవాటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తిగలవారు 8వ తేదీ సాయంత్రంలోపు ఏపీ చెస్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెలలో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్ : 90104 51585 నంబరును సంప్రదించాలన్నారు.
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
యశవంతపుర (బెంగళూరు): బైక్‌ల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్‌ట్ర దొంగలను బెంగళూరు హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్ (39), నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా (31) వివిధ ప్రాంతాల్లో స్కూటర్లు, బైకులను చోరీ చేసి వాటికి నకిలీ ఆర్‌సీ కార్డులను సృష్టించి అమ్ముతున్నారు. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్‌లు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దొ ంగలపై దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితు డిని పట్టుకుని విచారించగా చిత్తప్పగారి ఆనంద్, షేక్ షఫీర్ బాషా చోరీ చేసిన బైక్‌లను హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంట ర్నె ట్ సెంటర్‌లో డూప్లికేట్ ఆర్‌సీ కార్డులు రూ పొందించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిఘా వేసి ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ. 41.67 లక్షలు విలువగల 51 వాహనాలు, 501 నకిలీ ఆర్‌సీ కార్డులు సీజ్ చేసినట్లు మంగళవా ర ంబెంగళూరు నగర పోలీసు కమిషనర్ తెలిపారు.
సంగమేశ్వరంలో సహస్రనామ పారాయణం
కొత్తపల్లి: సప్తనది తీరానా వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయంలో మంగళవారం సాయంత్రం భక్తులు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి పూలమాలలతో అలంకరణ చేసి అభిషేకాలు, అర్చనలు చేశారు.


