ఆవును ఢీకొని.. | - | Sakshi
Sakshi News home page

ఆవును ఢీకొని..

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ఆళ్లగడ్డ: మండల పరిధిలోని బత్తలూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై అవును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన లింగప్రసాద్‌ (45) అనే వ్యక్తి ఆళ్లగడ్డలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మోటర్‌సైకిల్‌ పై బయలు దేరగా నల్లగట్ల సమీపంలోకి వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసి వెంటనే శిరివెళ్లకు రావాలని చెప్పారు. దీంతో నల్లగట్ల నుంచి శిరివెళ్లకు బయలు దేరగా బత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై నల్లని ఆవును గమనించకుండా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లింగప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చుని ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement