నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ చిత్రకారుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం సోమవారం ‘బాదం పప్పుపై బాల హనుమాన్ ‘అనే సూక్ష్మ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అష్టసిద్ధి ప్రదాత, నవ వ్యా కరణ పండితుడు అయిన శ్రీ హనుమంతుని ఆరాధన వల్ల బుద్ధి, బలం, ఆరోగ్యం, యశస్సు, ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయని చిత్రకారుడు తెలిపారు. అర్జునుడు తన రథం పైన హనుమద్ ధ్వజాన్ని స్థాపించడం వల్ల మహాభారత యుద్ధంలో తిరుగులేని విజయాన్ని సాధించారన్నారు.


