● 23 జిల్లాల నుంచి 850 మంది
క్రీడాకారుల హాజరు
గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఏడో సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలకు ఏపీలోని 23 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు (బాలికలు, బాలురు) హాజరయ్యారు. బాలుర విభాగంలో నెల్లురు జిల్లా జట్టు, ప్రకాశం టీమ్‌పై 6–0 తో, నంద్యాల జట్టు తిరుపతిపై 4–2 పాయింట్ల తేడాతో, కర్నూలుజట్టు గుంటూరుపై 4–0 పాయింట్లతో, బాపట్ల జట్టు కృష్ణాపై 2–0 పాయింట్లతో విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో కృష్ణాజిల్లా జట్టు అనకాపల్లిపై 5–4 పాయింట్లతో, నెల్లూరు జట్టు బాపట్లపై 7–1 పాయింట్లతో, విశాఖపట్నం జట్టు ప్రకాశంపై 5–2 పాయింట్లతో, కర్నూలు జట్టు చిత్తూరుపై 10–1 పాయింట్లతో, నంద్యాల జట్టు సత్యసాయిపై 7–0 పాయింట్లతో, పల్నాడు జట్టు అనంతపురంపై 7–1 పాయింట్లతో, గుంటూరుజట్టు బాపట్లపై 7–6 పాయింట్లతో విజయం సాధించి క్వాటర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, బేస్‌బాల్ లీగల్ అడ్వయిజర్ మాధవరావు, టోర్నమెంట్ అడ్వయిజర్ సుబ్బయ్య, కర్నూలు జిల్లా బేస్‌బాల్ యూనియన్ అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.


