రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

ఓర్వకల్లు: జాతీయ రహదారిపై కాల్వబుగ్గ వద్ద సోమవారం రాత్రి హైవే పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కాల్వబుగ్గలో భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయయ్యాడు. సోమవారం సాయంత్రం వ్యక్తితో ఆమె గొడవ పడింది. అతను దాడి చేయగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రోడ్డు దాటుతుండగా హైవే పెట్రోలింగ్‌కు చెందిన బొలెరో వాహనం మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

మృతిచెందిన మహిళ, ప్రమాదానికి కారణమైన హైవాహనం

Advertisement
 
Advertisement
Advertisement