ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాపురంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం చింతకుంట్ల చంద్రశేఖర్‌ రెడ్డి, ఉపాధ్యాయుడు హనుమంతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని బుధవారం డీఈఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవడం అభినందనీయమన్నారు. తిమ్మాపురం జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవనాల శ్రీనివాసులు, పిట్టల శ్రీనివాసులు, కల్లె మద్దిలేటి, గని శ్రీనివాసులు, చక్రధర్‌, జనార్ధన్‌న్‌, కుంపటి రమణయ్య, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement