హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

రూ.15లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి వెలసిన ప్రాంతాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదామని మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. డీజీవీ అతిథి గృహం వద్ద హైవే రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు మంగళవారం పీఠాధిపతులు శ్రీకారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు మఠం అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్‌ గార్డెన్‌, సుశమీంద్రతీర్థుల పార్క్‌, గురునివాస్‌, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత పీవీ బద్రినాథ్‌ రావు తీసుకున్నారు. ఈ పనులకు రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆయనను పీఠాధిపతి శాలువ, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement