ఇంటిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

● మహిళ మృతి, మరొకరికి గాయాలు

● మహిళ మృతి, మరొకరికి గాయాలు

సి.బెళగల్‌: పోలకల్‌ గ్రామంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం పచర్ల సురేష్‌ అనే వ్యక్తి వ్యవసాయ పనుల అనంతరం వీధిలో ట్రాక్టర్‌ నిలిపే సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కృష్ణ భార్య కౌలుట్లమ్మ (50), కుమారుడు పాండుపై ఇంటి గోడ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గోడ రాళ్లను తొలగించి గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో కౌలుట్లమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాండు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement