వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొప్పుల సుధాకరరెడ్డి రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మో త్సవాలకు భార్య సౌజన్య (35)తో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి దంపతులిద్దరూ స్వగ్రామానికి వెళ్లి పోయారు. నిద్ర మధ్యలో లేచి సౌజన్య ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత భర్త గమనించి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు సేకరించారు. సౌజన్య చాలా రోజుల నుంచి తల నొప్పితో బాధపడుతుందని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చెన్నపురెడ్డి సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్లెవేములలో భారీ చోరీ

చాగలమర్రి: మండలంలోని మల్లెవేముల గ్రా మంలో భారీ చోరీ జరిగింది. రూ.15.50 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు గోపిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తామంతా నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఇంటి వెనుక వైపున ఉన్న తలుపులను తెరుచుకొని దుండగులు ఇంట్లోకి వచ్చారన్నారు. బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ట్లు చెప్పారు. ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ వెంకట రమణ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంను ర ప్పించారు. వేలి ముద్రలను సేకరించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

కోవెలకుంట్ల: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన నరసింహుడు(85) కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుమారుడు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్‌ నుంచి కిందపడి

వ్యక్తి మృతి

ఓర్వకల్లు: పొలానికి మట్టిని తరలిస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో చేసుకుంది. మీదివేముల గ్రామానికి చెందిన ఎల్లయ్య(58) తన పొలానికి నల్లమట్టిని తరలించేందుకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణకు చెందిన ట్రాక్టర్‌ను గురు వారం అద్దెకు తీసుకున్నాడు. వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో ఉయ్యాలవాడ గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట వద్ద డ్రైవర్‌ పక్కన కూర్చు న్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement