● రూ. 10 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తోలు బొమ్మలాట ప్రదర్శన
గడివేముల: ప్రజలకు ఉపయోగపడేలా.. పది కాలా ల పాటు గ్రామంలో గుర్తుండేలా ఓ వ్యక్తి బస్‌షెల్ట ర్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గని గ్రామంలో రిటైర్ ఉపాధ్యాయుడు వెంకటరమణ, భార్య కళ్యా ణి రూ.10 లక్షలతో వెచ్చించి గ్రామస్తుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సు బ్బమ్మ, చిన్న మల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్‌ను మంగళవారం ప్రారంభిచనున్నారు. కాగా అంతరించి పోతున్న ప్రాచీన కళను ప్రోత్సహించేందుకు తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన ప్రాచీన జానపద కళారూపం. రాత్రి వేళల్లో, తెర వెనుక నుంచి దీపాల వెలుగులో బొమ్మలను ఆడిస్తూ, రామా యణ, మహాభారత వంటి పురాణ కథలను కళాకారులు వినోదాత్మకంగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా ఉన్న ఈ కళారూపం, నేడు సాంకేతికత పెరగడంతో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కొంతమంది కళాకారులు మాత్రమే ఈ కళను బతికించుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం సత్య సాయి జిల్లా లేపాక్షి చెందిన సిండే రామ్మూర్తి గ్రూపు వారు రామాయణం తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై వీక్షించాలని వెంకటరమణ కోరారు.


