మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

● జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

● జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఆలూరు: మహిళలు తమకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సూచించారు. స్థానిక ఎల్లార్తి రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం సైబర్‌ నేరాలు, లైగింకదాడులు, వేధింపులు, రక్షణ చట్టాలు వివిధ అంశాలపై మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం మహిళల రక్షణకు అనేక చట్టాలు రూపొందించిందన్నారు. వాటిపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఫోన్‌ చేసి ఓటీపీలు, బ్యాంకు ఖాతా నంబర్లు అడిగితే చెప్పరాదన్నారు. బాల్య వివాహాలు నేరమని, దీనిని ఎవ్వరూ ప్రోత్సహించరాదన్నారు. ప్రజల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్‌ ఫోన్‌లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పత్తికొండ డీఎస్పీ బి. వెంకటరామయ్య, ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మమత ప్రియ, ఆలూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు,ఐసీడీఎస్‌ సీడీపీఓ నరసమ్మ, ఆలూరు, దేవనకొండ, ఆస్పరి, సీఐలు ఐ.రవిశంకర్‌రెడ్డి, వేణుగోపాల్‌, శ్రీనివాసనాయక్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement