కర్నూలు(అర్బన్): అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ హెచ్చరించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్‌లో 62 శాతం నెగిటివిటీ వచ్చిన కోడుమూరు ప్రాజెక్టు పసుపుల –2 అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం పసుపుల 1, 3 కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లోని రిమార్కులపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


