కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

పాణ్యం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి కర్నూలు పట్టణానికి చెందిన యశ్వంత్‌, తేజస్విని దంపతులు రూ. 2.64 లక్షలు విరాళంగా అందజేశారు. స్వామివారికి కేజీ వెండి విలువైన డబ్బులను ఏపీజీపీ బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు ఈఓ రామకృష్డుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్‌శర్మ, పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement