అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో పనిచేయని ఫ్యాన్లు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. దీంతో రోగులు, వారి సహాయకులు ఉక్కపోతతో ఇబ్బంది ప డుతున్నారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలోని జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చే విభాగం వద్ద ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఆసుపత్రి అధికారులు ఈ దారిలోనే వెళ్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
– కర్నూలు(హాస్పిటల్)


