అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే!

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు

● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు

శ్రీశైలంప్రాజెక్ట్‌: సున్నిపెంటలో ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని అందులో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సున్నిపెంట ప్రభుత్వ గృహాల ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ భూ ఆక్రమణ చట్టం 1905 కింద 2,163 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. జలవనరులశాఖ, గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి తహసీల్దార్‌ ఇంటింటికి వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. నివాసితులు అందుబాటులో లేనిపక్షంలో గృహాలకు నోటీసులు అంటిస్తున్నారు. ఈనెల 17వ తేదీలోగా తహసీల్దార్‌ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. సంజాయిషీ సంతిృప్తకరంగా లేకుంటే చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నోటీసులో సూచించారు. అధికారులు జరిపిన సర్వేల ఆధారంగా రికార్డుల్లో 2,260 ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. వీటిలో 82 మంది జలవనరులశాఖ ఉద్యోగులు నివాసం ఉంటుండగా 247 గృహాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ గృహాలు, నివాస యూనిట్టు 428కి పట్టాలు మంజూరు చేయగా వాటిలో నాలుగు పట్టాలు సక్రమమైనవి కావని అధికారులు తేల్చారు. 277 మంది ప్రభుత్వ గృహాలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement